ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధర్నా..

X
By - TV5 Telugu |30 Aug 2019 6:09 PM IST
స్థానిక ప్రజాప్రతినిధులకు నిధులు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ప్రభుత్వ తీరుకు నిరసనగా వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై కోమటిరెడ్డి ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. వడపర్తి గ్రామ సర్పంచ్ కాలు విరిగింది. స్థానిక సంస్థల నిధుల కోసమే భువనగిరి నుంచి పోరాటం మొదలుపెట్టామన్నారు కోమటిరెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com