ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ రామకృష్ణరాజు కుటుంబం ఆత్మహత్య

ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ రామకృష్ణరాజు కుటుంబం ఆత్మహత్య

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ కృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కృష్ణంరాజు, భార్య, కుమారుడితో సహా ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురూ సెలైన్ ద్వారా విషం ఎక్కించుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

డాక్టర్ ఫ్యామిలీ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్లుగా సమాచారం. వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story