అంతర్జాతీయం

రెడ్‌మీ స్మార్ట్‌ టీవీ వచ్చేసింది.. లెస్ ఫ్రైస్.. అదిరిపోయే ఫీచర్స్

రెడ్‌మీ స్మార్ట్‌ టీవీ వచ్చేసింది.. లెస్ ఫ్రైస్.. అదిరిపోయే ఫీచర్స్
X

షావోమి సంస్థ నూతన ఉత్పత్తులతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఎంఐ మొబైల్ బ్రాండ్స్‌తో జనాలను ఆకర్షిస్తున్న షావోమి ఇప్పుడు స్మార్ట్‌టీవీలతో ఎలక్ట్రానిక్‌ మార్కెట్‌ను ముంచెత్తుతోంది. తాజాగా రెడ్‌మీ మరో బ్రాండ్‌ను ప్రారంభించింది. తన తొలి స్మార్ట్‌టీవీని గురువారం ఆవిష్కరించింది. ఈ టీవీని బీజింగ్‌లో విడుదల చేసింది. దీన్ని ‘రెడ్‌మీ టీవీ 70-ఇంచ్‌’ బ్రాండ్ పేరుతో త్వరలో అంతర్జాతీయ మార్కెట్‌లోకి లాంచ్ చేయబోతున్నారు.

ఈ స్మార్ట్ టీవీని ఆధునిక ఫీచర్లతో రూపొందించారు. 4కే రిజల్యూషన్ స్క్రీన్‌‌, హెచ్‌డీఆర్‌ సపోర్ట్‌, క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌ లాంటి ఫీచర్లు దీనిలో ఉన్నాయి. వాల్ -మౌంటెడ్, టేబుల్‌టాప్‌‌కి ఎలాగైనా దీనిని ఫిక్స్ చేసుకోవచ్చు. రెడ్‌మి టీవీ సంస్థ ప్యాచ్‌వాల్ ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా ఇది నడుస్తుంది. క్వాడ్-కోర్ 64-బిట్ అమ్లాజిక్ SoC లాంటి సదుపాయంతో పాటు 2జీ ర్యామ్‌, 16జీబీ అంతర్గత సామర్థ్యంతో దీనిని తయారుచేశారు. ఆడియో టెక్నాలజీస్‌‌లో కూడా ఆధునిక సదుపాయలను కల్పించారు. డాల్బీ ఆడియో, డీటీఎస్‌ హెచ్‌డీ సౌండ్స్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది.

ఈ టీవీ అమ్మకాలు సెప్టెంబరు 3 నుంచి చైనాలో ప్రారంభం కానున్నాయి. దీని ధరను 3,799 (రూ.38 వేలు) చైనీస్‌ యువాన్లుగా నిర్ణయించారు. అయితే దీనిని ఎప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేస్తారన్నదానిపై క్లారిటీ లేదు. సెప్టెంబరు రెండో వారం తర్వాత భారత్‌ మార్కెట్లోకి వచ్చే అవకాశాలున్నాయి.

Next Story

RELATED STORIES