'సాహో' బిజినెస్‌లో సరికొత్త రికార్డ్!

ప్రభాస్ 'సాహో' సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన స్పందన వస్తోంది. బాహుబలి తర్వాత 2 ఏళ్లకు యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'సాహో' హిట్ టాక్ సంపాదించుకుంది. ఓవర్‌సీస్‌లో కూడా మంచి టాక్ రావడంతో.. బిజినెస్‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుందన్న అంచనాలున్నాయి.
దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో సాహో తెరకెక్కింది. సుజిత్ డైరెక్టర్. సినిమాలో యాక్షన్ పార్ట్ షూటింగ్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేశారు. తెలుగుతోపాటు తమిళ్, మళయాళం, హిందీల్లో రిలీజ్ చేశారు. బాహుబలి తర్వాత ప్రభాస్‌కి ఉత్తరాదిన కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ అంచనాల్ని అందుకునేలా సాహో ఉండడంతో.. కలెక్షన్ల వర్షం ఖాయమంటున్నారు. తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్లిన సినిమాగా ఫ్యాన్స్ దీన్ని అభివర్ణిస్తున్నారు. ఇంటర్వెల్ టైమ్‌లోనూ, క్లైమాక్స్‌లోనూ వచ్చే సీన్లు హైలైట్‌గా చెప్తున్నారు. హీరోయిన్ శ్రద్ధాకపూర్‌తోపాటు నీల్ నితిన్ ముఖేష్, జాకీష్రాఫ్, మందిరాబేడీ, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించడంతో ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారు.
సాహోలో అండర్ కవర్ ఆఫీసర్‌గా కనిపించాడు ప్రభాస్. ముంబైలో జరిగిన 2వేల కోట్ల దొంగతనం కేసు మిస్టరీ ఛేదించే అశోక్ చక్రవర్తిగా యాక్షన్ ఇరగదీశాడు. శ్రద్ధాకపూర్‌తో రొమాన్స్ కూడా తెరపై బాగానే పండింది. డార్లింగ్ ప్రభాస్.... సాహో హిట్‌తో ఫుల్ జోష్‌గా ఉన్నారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా దుబాయ్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ టీవీ5 టీమ్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com