మామా.. మీరు సూపర్.. సమంత సెటైర్

మామా.. మీరు సూపర్.. సమంత సెటైర్

టాలీవుడ్ నవమన్మథుడు నాగార్జున తన 60 వ పుట్టినరోజును స్పెయిన్‌లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు వేడుకల్ని సెలబ్రేట్ చేయడానికి కుటుంబసభ్యులంతా అక్కడికి వెళ్లారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సొషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కోడలు సమంత కూడా ఇన్‌స్టా వేదికగా అక్కడ నాగార్జున స్విమ్మింగ్‌పూల్‌లో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. మీతో పాటు మీ పక్కన వున్న వారందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అదే మీ గొప్పతనం. మీరు మీ వయస్సును కూడా ఓడించారు మామా.. హ్యాపీ బర్త్‌డే కింగ్ నాగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో పాటు కుటుంబసభ్యులతో కలిసి దిగిన మరో ఫోటోను కూడా సమంత షేర్ చేశారు.

ఇటీవల నాగార్జున నటించిన మన్మథుడు-2 సినిమా మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అఖిల్ కూడా ఓ కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక సమంత నెక్ట్స్ మూవీ ఏంటీ అనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈమధ్య తను సెలెక్ట్ చేసుకునే కథాంశాలన్నీ ఆమెకు మంచి పేరు తీసుకువస్తున్నాయి. పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన నటించిన ఓబేబిని ప్రేక్షకులు మరిచిపోలేకపోతున్నారు. అందులో సమంత నటన సూపర్ అని అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు.

Tags

Read MoreRead Less
Next Story