చేతబడి చేశాడనే నెపంతో వ్యక్తిని అత్యంత దారుణంగా..

చేతబడి చేశాడనే నెపంతో వ్యక్తిని అత్యంత దారుణంగా..

యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగెంలో రెండు రోజుల క్రితం జరిగిన శంకరయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. మూఢనమ్మకాలే హత్యకు కారణమని తేల్చారు. మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో శంకరయ్య అనే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని రిమాండ్‌కు తరలించారు.

సంగెం గ్రామానికి చెందిన బోయిని శంకరయ్య హైదరాబాద్‌లో తండ్రి దగ్గర ఉంటున్నాడు. అయితే గ్రామానికి చెందిన బంధువు చనిపోతే భార్యతో కలిసి వెళ్లాడు. అంత్యక్రియల సందర్భంగా చెవులకు ఉన్న కమ్మలను గుంజుకుంటూ శంకరయ్య దగ్గాడు. ఇదే శంకరయ్య చేసిన పాపమైంది. తన భార్యకు చేతబడి చేశాడనే కారణంతో అదే గ్రామానికి చెందిన శంకరయ్య అనే మరో వ్యక్తి.. కొంత మంది వ్యక్తులతో కలిసి హత్యకు ప్లాన్‌ చేశాడు. బైక్‌పై వెళ్తున్న శంకరయ్యను స్కార్పియోతో ఢీకొట్టించాడు. కింద పడిపోయిన శంకరయ్యను గొంతు కోసి హత్య చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story