ఆంధ్రాబ్యాంకు విలీనాన్ని వ్యతిరేకిస్తూ నిర్మల సీతారామన్‌కు కేవీపీ లేఖ

ఆంధ్రాబ్యాంకు విలీనాన్ని వ్యతిరేకిస్తూ నిర్మల సీతారామన్‌కు కేవీపీ లేఖ
X

ఆంధ్రాబ్యాంక్‌ను ఇతర బ్యాంకుల్లో విలీనం చేయొద్దని కోరుతూ.. రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రారావు.. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు లేఖ రాశారు. ఆంధ్రప్రజలకు గర్వకారణం అయిన ఆంధ్రాబ్యాంకును రూపుమాపి తమ ఆత్మగౌరవాన్ని కించపరచొద్దన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు భోగరాజు పట్టాభిసీతారామయ్య నెలకొల్పిన బ్యాంకును అలాగే కొనసాగించాలని కోరారు. ఇప్పటికే రాష్ట్ర విభజన వల్ల ఆంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్న భావన తమలో ఉందన్నారు. ఏపీ కోడలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రాబ్యాంకు పేరు తొలగించిన అపఖ్యాతి తెచ్చుకోకండన్నారు.. కేవీపీ రామచంద్రరావు.

Tags

Next Story