పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌పై సీఐ సంచలన ఆరోపణలు

పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌పై సీఐ సంచలన ఆరోపణలు
X

పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌పై సంచలన ఆరోపణలు చేశారు సీఐ దాసరి భూమయ్య. రిటైర్డ్‌ అయిన అధికారులకు గన్‌మెన్‌ ఇస్తారు కానీ.. నాకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఇప్పటి వరకు రిటైర్డ్‌ అయిన అధికారులను ఎవరూ చంపిన దాఖలాలు లేవని.. ప్రభుత్వం వెంటనే గన్‌మెన్‌లను తొలగించాలని డిమాండ్‌ చేశారు. రిటైర్డ్ అధికారులకు గన్‌మెన్లు ఇవ్వడం వల్ల ప్రజా ధనం వృథా అవుతుందని అన్నారు. తనను చంపడానికి సీఐ వేణుగోపాల్‌ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు సీఐ భూమయ్య.

గతంలో కూడా సంచలనాలకు మారుపేరుగా నిలిచాడు భూమయ్య. పలు ఆరోపణలు చేసి ఉద్యోగాన్ని కోల్పోయి మళ్లీ విధుల్లో చేరిన భూమయ్య.. మళ్లీ సంచలనాలకు తెరలేపారు. గతంలో హుస్నాబాద్‌లో ఉన్న సమయంలో అధికారి భార్య.. సొంత పనులకు వాడుకోవడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు భూమయ్య. దీంతో డిపార్ట్‌మెంట్‌కు అతను టార్గెట్‌గా మారాడు. విధుల నుంచి తప్పించారు. ఇక ఆదిలాబాద్‌లో విధులు నిర్వహిస్తుండగా రెండు తుపాకులు మిస్సింగ్‌ కేసులో భూమయ్యను ఉద్యోగం నుంచి తొలగించారు. తుపాకుల మిస్సింగ్‌ కేసులో భూమయ్య ప్రమేయం లేదని తేలడంతో మళ్లీ అతన్ని విధుల్లోకి తీసుకున్నారు.

Tags

Next Story