వన మహోత్సవాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

వన మహోత్సవాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌
X

ఏపీలో వన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రులో వన మహోత్సవం నిర్వహించారు. డోకిపర్రు వద్ద మొక్కలు నాటి వనమహోత్సవాన్ని ప్రారంభించారు సీఎం జగన్‌. అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలను ఆయన తిలకించారు. అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి. ఈ సందర్బంగా వన మహోత్సవాల్లో భాగంగా మొత్తం 25 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంగా పెట్టుకుంది అటవీశాఖ.

Tags

Next Story