ఎనిమిది రోజులు.. స్కూల్స్‌కి సెలవులు..

ప్రభుత్వ పాఠశాలలకు, కాలేజీలకు ఊహించని విధంగా ఏడు రోజులు సెలవులు వచ్చాయి అనంతపురం జిల్లా విద్యార్థులకు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సచివాలయ గ్రామ, వార్డు పరీక్షలు ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు జరగనున్నాయి. దీంతో సెప్టెంబర్ నెల 1,,4,6,7,8 తేదీల్లో మొత్తం ఆరు రోజుల పాటు స్థానిక సెలవులు ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈనెల 22న ఉత్తర్వులు జారీ చేసారు. అలాగే అనంతపురం జిల్లాలో డీఎస్సీ పరీక్షలు జరుగుతుండడంతో వాటి ప్రారంభానికి ముందు రోజు కూడా స్థానిక సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శనివారం కూడా సెలవు వచ్చినట్లయింది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 398 పరీక్షలు నిర్వహించే కేంద్రాలుంటే వాటిలో పరీక్షలు జరిగే స్కూల్స్, కాలేజీలతో పాటు పరీక్షల డ్యూటీకి వెళ్లే ఉపాధ్యాయులున్న విద్యాసంస్థలకు కూడా సెలవులు ప్రకటించారు. అలా మొత్తం మీద ఏకంగా వారం రోజులు పాఠశాలలకు సెలవులు వచ్చాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com