సెల్‌టవర్ ఎక్కి మహిళ హల్‌చల్..

సెల్‌టవర్ ఎక్కి మహిళ హల్‌చల్..

తనకు అన్యాయం జరిగిందంటూ ఓ మహిళ సెల్‌ టవర్‌ ఎక్కింది. భూమిని తన పేరున పట్టా చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ ఘటన నల్గొండ జిల్లా నకిరేకల్‌ మండలం కడపర్తి గ్రామంలో జరిగింది. సెల్‌ టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేసిన ఈ మహిళ పేరు అంజమ్మ. ఈమె యాతకుల సోమయ్యకు రెండో భార్య. మొదటి భార్య కమలమ్మకు పిల్లలు లేకపోవడంతో అంజమ్మను సోమయ్య రెండో పెళ్లి చేసుకున్నాడు. అంజమ్మకు 20 ఏళ్ల కొడుకు ఉన్నాడు. భర్త చనిపోవడంతో ఎకరం 20 కుంటల భూమిని సాగు చేసుకుంటోంది. అయితే పాస్‌ బుక్‌లో మొదటి భార్య కమలమ్మ పేరు ఉండటంతో ఆమె రాత్రికి రాత్రే సాగులో ఉన్న భూమిని దున్నేసింది. దీంతో మనస్థాపానికి గురైన అంజమ్మ ఇలా సెల్‌ టవర్‌ ఎక్కింది.

Tags

Read MoreRead Less
Next Story