కూకట్‌పల్లి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హత్య కేసులో కొత్త ట్విస్ట్‌

కూకట్‌పల్లి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హత్య కేసులో కొత్త ట్విస్ట్‌

కూకట్‌పల్లి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హత్య కేసులో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసుల అనుమానిస్తున్నారు. పథకం ప్రకారమే సతీష్‌ను హేమంత్‌ హత్య చేసినట్లు నిర్ధారించారు పోలీసులు. సతీష్‌ను ఇంటికి పిలిచి హేమంత్‌ హత్య చేసినట్లు సమాచారం. హేమంత్‌ స్నేహితురాలు ప్రియాంకతో సతీష్‌కు సన్నిహిత సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో ప్రియాంకను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హేమంత్, సతీష్‌ మధ్య ఆర్థికపరమైన గొడవలున్నట్లు ప్రియాంక వాంగ్మూలం ఇచ్చింది. నిందితుడు హేమంత్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story