ఆంధ్రప్రదేశ్

పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు

పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు
X

రాజధాని రైతుల సమావేశంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. మంగళగిరిలో రైతులతో సమావేశం నిర్వహించిన పవన్‌ కల్యాణ్‌.. డైరెక్ట్‌గా మంత్రి బొత్స సత్యనారాయణను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వానికి బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి కావచ్చొమే నంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో బొత్స సీఎం కాలేకపోయారన్న జనసేనాని.. భవిష్యత్తులో కావచ్చంటూ జోస్యం చెప్పారు. పవన్‌ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

గతంలో పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు విమర్శించినా.. ఇలాంటి కామెంట్స్‌ ఎప్పుడూ చేయలేదు.. ఇటీవల బొత్స సత్యనారాయణ రాజధానిపై చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో దుమారం రేపాయి.. దీంతో రాజధాని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రైతుల పక్షాన పోరాడతానని చెప్పిన పవన్‌ కల్యాణ్‌.. మంగళగిరిలో నిర్వహించిన సమావేశంలో వ్యూహాత్మకంగా మాట్లాడారు. తన ప్రసంగంలో పదే పదే బొత్స సత్యనారాయణ పేరును ప్రస్తావించారు. ముఖ్యమంత్రి కావాలనే కోరిక బొత్స సత్యనారాయణలో ఉందని.. ఈ ప్రభుత్వంలో జగన్‌ ఉంటారో లేదో తెలియదుగానీ.. ప్రభుత్వంలో మీరుంటారంటూ బొత్సను ఉద్దేశిస్తూ కామెంట్స్‌ చేశారు. ఆలోచించి సలహాలు ఇవ్వాలంటూ బొత్సకు సూచించారు పవన్‌ కల్యాణ్‌.

రాజధానిపైనా జనసేన అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి నుంచి రాజధానిని మార్చితే ఊరుకోబోమని హెచ్చరించారు. అమరావతిని మార్చడమంటే మోడీ, అమిత్‌షాను వ్యతిరేకించడమేనని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Next Story

RELATED STORIES