తెలంగాణ ఆడపడుచుల కోసం సిద్ధమవుతున్న సిరిసిల్ల చీరె

గతంలో ఉరిశాలగా ఉన్న సిరిసిల్ల నేడు సిరిశాలగా మారింది. చేనేత కార్మికుల ఇళ్లలో సందడి నెలకొంది. ఉపాధి లేక ఇన్ని రోజులు వలస బాట పట్టిన సిరిసిల్ల నేతన్నకు ఇప్పుడు చేతినిండా పనితో సంతోషంగా ఉన్నాడు. బతుకమ్మ కోసం ఏకంగా కోటి చీరలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్డరివ్వడంతో వాటి తయారీలో మునిగిపోయారు చేనేత కార్మికులు. 100 రంగుల్లో తెలంగాణ ఆడపడుచుల కోసం బతుకమ్మ చీరలు రూపుదిద్దుకుంటున్నాయి.
122 మ్యాక్ సొసైటీల ద్వారా వంద రకాల చీరెలు యుద్ధ ప్రాతిపదికన సిద్ధమవుతున్నాయి. సెప్టెంబర్ 28లోగా పంపిణీకి రెడీ కానున్నాయి. కోటి చీరెల ఆర్డర్‌తో సిరిసిల్లలో దాదాపు 10 వేల మంది కార్మికులకు ఉపాధి లభించింది. కార్మికులను పారిశ్రామికవేత్తలుగా మార్చాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలులోకి తెచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com