నాలా మీ జీవితం కాకూడదు.. ఓ యువతి ఆవేదన

నాలా మీ జీవితం కాకూడదు.. ఓ యువతి ఆవేదన

వ్యాపింగ్( మత్తును పీల్చే అలవాటు) ఓ యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. మూడేళ్ళుగా ఉన్న ఆ చెడు వ్యసనం ఆమెను చావు అంచుల వరకు తీసుకెళ్లింది. మాడీ నెల్సన్ అనే 18 ఏళ్ళ యువతి గత నెలలో తీవ్రమైన వెన్ను,మూత్రపిండాల నొప్పి కారణంగా ఆస్పత్రిలో చేరింది. అమెరికాలోని ఉటాకు చెందిన ఆ యువతి ఉపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్న సమయంలో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు, అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో ఆమె పరిస్థితి మరింతగా క్షీణించింది. చివరకు ఆమె కోమాలోకి వెళ్ళింది.

ఆమెను పరీక్షించిన వైద్యులు ఊపిరితిత్తులకు తీవ్ర స్ధాయిలో నష్టం వాటిల్లినట్లుగా గుర్తించారు. వివిధ పరీక్షల అనంతరం ఆమె తీవ్రమైన "ఇసినోఫిలిక్ న్యుమోనియా" సమప్యతో బాధపడుతోందని తేలింది. ఈ-వ్యాపింగ్ కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్లుగా వైద్యులు దృవీకరించారు. డాక్టర్ల కృషితో మూడు రోజుల తర్వాత ఆమె కోమాలో నుంచి బయటపడింది.

తన లైఫ్‌లో వ్యాపింగ్ అలవాటు ఎంతటి దుష్ప్రభావాన్ని చూపిందో.. చావు అంచుల వరకు ఎలా వెళ్లి తిరిగి వచ్చిందో.. ఆ అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా ఇతరులతో పంచుకుంది. తను ఆస్సత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తీసిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది. "ఆ బెడ్‌పై ఎంతో నరకాన్ని అనుభవించాను. నాలా మీరు కాకూడదు. జీవితం చాలా విలువైనది. ఆ పొగ ఘాటు తాత్కాలికమైన ఆనందం, కానీ అది పూర్తి జీవితాన్ని బలి చేస్తుంది" అంటూ వివరించింది. వ్యాపింగ్, సిగరెట్ అలవాటు ఉన్నవారు వాటిని మానుకోవాలంటూ తను చేసిన విజ్ఞప్తికి నెటిజన్స్‌ నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. మాడీ నెల్సన్ కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది వ్యాపింగ్, ధూమపానం అలవాటుతో అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story