పోలీసన్నా మీరు సూపర్.. వీడియో వైరల్

ట్రాఫిక్ పోలీసంటే వాహనాల్ని నియంత్రించడం.. చలాన్లు రాయడమే కాదు. కష్టాల్లో ఉన్నవారికి నేనున్నాంటూ అండగా నిలబడడం కూడా అని నిరూపించారు ఓ పోలీస్. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు సాక్షిగా నిలిచారు. భారీ వర్షంతో భాగ్యనగర రోడ్లు నదుల్ని తలపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మామూలుగానే రోడ్డు దాటడం కష్టంగా ఉంటుంది. ఇక ఓ పేషెంట్ పరిస్థితి మరీ కష్టం. ఎల్బీనగర్‌కు చెందిన ఓ యువకుడు తండ్రిని హాస్పిటల్‌నుంచి తీసుకువస్తూ రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీటిలో చిక్కుకుపోయాడు. తండ్రి కాలుకి ఉన్న బ్యాండేజ్ తడిచిపోయేలా ఉంది. బండి ముందుకెళ్లట్లేదు.. ఏం చేయాలో అర్థం కాలేదు ఆ యువకుడికి. ఇదంతా అక్కడే డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ గమనించాడు. వెంటనే అతడి దగ్గరకు వచ్చి యువకుడి తండ్రిని స్వయంగా తన భుజాలపై మోసుకుంటూ రోడ్డు అవతలకి దాటించాడు. దీన్ని అక్కడే ఉన్న స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్రాఫిక్ పోలీస్ ఔదార్యం చాలా గొప్పదంటూ నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Lb nagar Traffic CI nagamallu assisting a person with disability at sagar ring road.@KTRTRS @RaoKavitha @HYDTP @hydcitypolice pic.twitter.com/4fEAwjAI2f
— Varun Thakkallapalli (@varuntrs58) August 30, 2019
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com