సెప్టెంబర్‌ 1నుంచి కాస్త జాగ్రత్తగా ఉండండి!.. లేకపోతే..

సెప్టెంబర్‌ 1నుంచి కాస్త జాగ్రత్తగా ఉండండి!.. లేకపోతే..

సెప్టెంబర్‌ 1నుంచి అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే రంగు పడుతుంది. ఇటీవలే పార్లమెంట్ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అవి సెప్టెంబర్‌ 1నుంచి అమల్లోకి రానున్నాయి. ఆదాయ పన్ను రిటర్న్స్‌, మోటారు వాహనాల సవరణ చట్టం, ఐఆర్‌సీటీసీ సర్వీస్‌ ఛార్జీల విధానంలో కీలక మార్పులు చేశారు. అవి సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి.ఇక రూల్స్ అతిక్రమించారో ఫైన్ పడడం ఖాయం. కావున కాస్త కేర్‌ఫుల్‌గా ఉండ్సాలిందే. అయితే సెప్టెంబర్‌ 1 నుంచి కొత్తగా అమల్లోకి వచ్చేవి ఏంటో చూద్దాం...

మీరు కొనే ఇంటి విలువ రూ.50 లక్షలు దాటితే విక్రయదారుడికి ఆ మెుత్తాన్నిచెల్లించడానికి ముందుగానే 1 శాతం టీడీఎస్‌ను మినహాయించుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలో టీడీఎస్‌ను డిపాజిట్‌ చేయకపోతే,దానిపై 1–1.5 శాతం వడ్డీ రేటుతోపాటు పెనాల్టీ ఛార్జీలను కూడా చెల్లించాల్సి వస్తుంది. అలాగే ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ‌) ఈ-టికెట్లపై సర్వీసు ఛార్జీలను పెంచింది. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న నాన్‌ ఏసీ టికెట్లపై రూ. 15, ఏసీ టికెట్‌పై రూ. 30 వరకు సర్వీస్ ఛార్జీలను వసూలు చేయనుంది. తాజాగా సవరించిన మోటారు వాహనాల చట్టం కూడా సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. ట్రాఫిక్‌ రూల్స్ ఉల్లంఘించే వారు ఇక భారీగా జరిమానాలు చెల్లించాల్సిందే. ఇప్పటికే ఈ చట్టంపై పోలీసులు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించి డబ్బులు ఆదా చేసుకోవాలని ప్రమాదాల నివారణకు తోడ్పడాలని వాహనదారులకు కోరారు.

Tags

Read MoreRead Less
Next Story