ఆ విషయంలో వైసీపీది అవివేక చర్య. - జనసేన

X
By - TV5 Telugu |1 Sept 2019 7:56 PM IST
రాజధానిపై కనీస స్పందన చూపని వైసీపీ నాయకులు... పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయడమేంటని మండిపడ్డారు... జనసేన నాయకులు కందుల దుర్గేష్. రాజధానిలో అవకతవకలు జరిగితే... వాటిని సరిచేయాల్సింది పోయి.. రాజధానినే తరలించాలని అనుకోవడం అవివేకమన్నారు. రాజధాని విషయంలో ఎవరూ స్పందించకముందే పవన్ కళ్యాణ్ గళమెత్తిన విషయం అందరికీ తెలుసన్నారు. ఈ విషయంలో కావాలనే కొందరు నేతలు చవకబారు విమర్శలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇప్పటికైన ప్రభుత్వం రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేసి రైతుల్లో ఉన్న ఆందోళనను తొలగించాలని కందుల దుర్గేష్ డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com