ఇలా సత్కరించడం చాలా ఆనందంగా ఉంది:ఈటెల రాజేందర్

ఇలా సత్కరించడం చాలా ఆనందంగా ఉంది:ఈటెల రాజేందర్

పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థలను, వ్యక్తులను గుర్తించి అవార్డులతో సత్కరించడం అభినందనీయమని ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు .హైదరాబాద్ జలవిహార్‌లో SRR ఫార్చూన్ ఇన్ఫా వైద్య రత్న 2019 తెలంగాణ హెల్త్ కేర్ అవార్డ్స ప్రధానోత్సవానికి మంత్రులు ఈటెల రాజేందర్ ,శ్రీనివాస్ గౌడ్ ,ఎర్రబెల్లిదయాకర్‌రావులు హాజరయ్యారు. ఆరోగ్య తెలంగాణ కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎస్‌ఆర్‌ఆర్ ఇన్‌ఫ్రా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సినీ నటులు అలీ ,దర్శకులు సుకుమార్,ప్రెస్ అకాడమి ఛైర్మన్ అల్లం నారాయణలు పాల్గొన్నారు . అనంతరం ఆయా రంగాల్లో సేవలు అందించిన వైద్యులకు వైద్య రత్న అవార్డులతో సత్కరించారు .

Tags

Read MoreRead Less
Next Story