కూతురును కాపురానికి పంపించలేదని.. అత్తను కత్తితో పొడిచిన అల్లుడు

కూతురును కాపురానికి పంపించలేదని.. అత్తను కత్తితో పొడిచిన అల్లుడు

సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్‌ మండలం మిట్టగూడెం గ్రామంలో దారుణం జరిగింది. బిడ్డను కాపురానికి పంపించలేదని కోపంతో అత్తను కత్తితో పొడిచి హత్య చేశాడు అల్లుడు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడ్డ లలితను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే ఆమె ప్రాణాలు కోల్పోయింది.

బొడ్డు లలితకు ముగ్గురు కూతుళ్లు. చిన్న కూతురును మల్లారెడ్డి గూడెంకు చెందిన అఖిల్‌ అనే యువకుడికి ఇచ్చి వివాహం చేసింది. అయితే కొన్ని రోజులుగా భార్యను చిత్ర హింసలకు గురి చేస్తున్నాడు. తాగి నిత్యం వేధిస్తున్నాడు. దీంతో లలిత కూతురు గత కొన్ని రోజులుగా పుట్టింటి వద్దే ఉంటుంది. తాను రమ్మన్నా ఇంటికి రావడం లేదని పగ పెంచుకున్న అఖిల్‌.. రాత్రి బాగా తాగొచ్చి అత్తతో గొడవపడ్డాడు. ఆవేశంలో అత్తను కత్తితో పొడిచాడు. నిందితుడు అఖిల్‌ను చితకబాదిన స్థానికులు.. పోలీసులకు అప్పగించారు.

Tags

Read MoreRead Less
Next Story