ఆంధ్రప్రదేశ్

చిన్ననాటి కల ఇప్పుడు సాకారమైంది: వెంకయ్య నాయుడు

చిన్ననాటి కల ఇప్పుడు సాకారమైంది: వెంకయ్య నాయుడు
X

దేశంలో మౌలిక సదుపాయల రూపకల్పన వేగంగా జరుగుతోందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఏ ప్రభుత్వమైనా ఢిల్లీ నుంచి వచ్చిన నిధులను గల్లీదాకా చేరెలా చేయడంతో పాటు అవినీతికి తావులేకుండా చూడాలని కోరారు. గూడూరు-విజయవాడ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య, కేంద్రమంత్రులు సురేష్ అంగడి, కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు. దేశంలో పూర్తిస్థాయిలో విద్యుదీకరించిన వెంకటాచలం- ఓబులవారిపల్లి రైలు సొరంగ మార్గాన్ని జాతికి అంకితం చేశారు. ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌తో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల అవసరాలు తీరుతాయన్న వెంకయ్య.. మరోవైపు.. మారుమూల ప్రాంతాలకు రైలు సౌకర్యం రావడం హర్షణీయం అన్నారు. అలాగే తాను పుట్టి పెరిగిన ఊరికి దగ్గరగా రైల్వే లైను వెళ్లడం చాలా ఆనందంగా ఉన్నారు. తన చిన్ననాటి కల ఇప్పుడు సాకారమైందంటూ సంతోషం వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES