పెళ్లి కుమార్తెగా ఆలియా!

పెళ్లి కుమార్తెగా ఆలియా!

బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్ పెళ్లి కూతురిలా మారింది. అదేంటి ఆలియా రహస్య వివాహం ఏమైనా చేసుకుందని.. అనుకుంటున్నారా? ఆమె ఓ ప్రముఖ దుస్తుల బ్రాండ్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. ప్రమోషన్‌లో భాగంగా పెళ్లి కుమార్తె కాస్ట్యూమ్స్ లో మెరిసింది. ఎరుపురంగు లెహెంగా, ఆభరణాలతో పెళ్లికుమార్తె లుక్‌లో చాలా అందంగా కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘

ఇటీవలే విడుదలైన ‘కళంక్‌’ సినిమాలో ఆలియా నటించారు. ప్రస్తుతం ఆమె ఎస్.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో చరణ్ సరసన నటిస్తున్నారు.రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా శర వేగంగా షూటింగ్ జరుగుతోంది. అలాగే బాలీవుడ్‌లో ‘బ్రహ్మాస్త్ర’, ‘సడక్‌ 2’ చిత్రాల్లోనూ ఆలియా కథానాయికగా నటిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story