ఫీల్డులోకి అడుగుపెట్టిన అభినందన్.. తొలిసారి..

పాక్ చెర నుంచి విడుదలైన తర్వాత వింగ్ కమాండర్ అభినందన్ తొలిసారి మిగ్-21 ఎయిర్‌క్రాప్ట్ నడుపుతున్నారు. పూర్తి ఫిట్‌నెస్‌తో మళ్లీ ఫీల్డులోకి వచ్చారు.
బాలాకోట్ దాడుల నేపథ్యంలో అభినందన్ పేరు వార్తల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 27న పాకిస్థాన్ ఫైటర్ జెట్స్‌తో అభినందన్ వీరోచితంగా పోరాడారు. పాక్‌కు చెందిన F-16 ఫైటర్ జెట్‌ను కూల్చేశారు. ఆ క్రమంలో అభినందన్ ప్రయాణిస్తున్న మిగ్-21 విమానం కూలిపోయింది. దురదృష్టవశాత్తూ ఆయన పీఓకేలో ప్రవేశించారు. దాంతో పాక్ సైనికులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కానీ, భారత ప్రభుత్వం దౌత్యం ఫలించడంతో 48 గంటల్లోనే ఆయన విడుదలయ్యారు. పాక్ చెరలో ఉన్న సమయంలో అభినందన్ అంతులేని ధైర్యాన్ని ప్రదర్శించారు. దేశ రక్షణ రహస్యాలను బయటపెట్టకుండా నిబ్బరంగా వ్యవహరించారు.
పాకిస్థాన్ చెర నుంచి బయటపడిన తర్వాత అభినందన్ నేరుగా IAF ఆధీనంలోకి వెళ్లిపోయారు. IAF అధికారులు, ఆయనకు మానసికంగా, శారీరకంగా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఫిజికల్‌గా, మెంటల్‌గా అభినందన్ ఫిట్‌గా ఉన్నాడని వైద్యులు రిపోర్ట్ ఇవ్వడంతో ఆయన మళ్లీ ఫీల్డులోకి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అభినందన్‌కు వీరచక్ర పురస్కారాన్ని ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com