పార్లమెంటు ఆవరణలోకి కత్తితో ప్రవేశించిన దుండగుడు

పార్లమెంటు ఆవరణలోకి కత్తితో ప్రవేశించిన దుండగుడు
X

పార్లమెంటు ఆవరణలోకి గుర్తు తెలియని వ్యక్తి కత్తితో ప్రవేశించి కలకలం సృష్టించాడు. ఆ వ్యక్తిని చూసిన భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గేట్‌ నెంబర్‌ 1 నుంచి దుండగుడు లోపలికి ప్రవేశించాడు.

అత్యంత కట్టుదిట్టంగా ఉండే పార్లమెంటు ఆవరణలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడంతో భద్రతా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. తీవ్రవాద దాడులు జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నా ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.

Tags

Next Story