అంతర్జాతీయం

ఘోర విషాదం.. అందరూ చూస్తుండగానే గాయని..

ఘోర విషాదం.. అందరూ చూస్తుండగానే గాయని..
X

సంగీత కార్యక్రమంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. వేదికపై అందరూ చూస్తుండగానే గాయని సజీవదహనం అయింది. ఈ ఘటన స్పానిష్ లో చోటుచేసుకుంది. ఆదివారం స్పానిష్ లో మ్యూజికల్‌ షో జరిగింది. ఈ షో కు ప్రముఖ పాప్‌స్టార్‌, డాన్సర్‌ జోయానా తన బృందంతో కలిసి ప్రదర్శన ఇస్తున్నారు. ఈ క్రమంలో రాకెట్ బాణాసంచా కాలుస్తున్నారు. అయితే ప్రమాదవశాత్తూ రెండు రాకెట్లు స్టేజిమీదకు దూసుకు వచ్చాయి. అందులో ఒకటి జోయానా కడుపులోకి దూసుకుపోయింది. ఇంతలో పేలుడు సంభవించి తీవ్రంగా మంటలు వ్యాపించాయి. ఆమె మంటల్లో సజీవదహనం అయ్యారు. సిబ్బంది.. జోయానాను కాపాడే ప్రయత్నం చేసిన కుదరలేదు. మంటల్లో కాలిపోయిన జోయానాను ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.

Next Story

RELATED STORIES