ఆయన మృతి బాధకలిగించింది : ఎమ్మెల్యే హరీశ్‌ రావు

ఆయన మృతి బాధకలిగించింది : ఎమ్మెల్యే హరీశ్‌ రావు

సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో మాజీ మంత్రి ముత్యంరెడ్డి భౌతిక కాయానికి పూలమాల వేసి, నివాళులర్పించారు టీఆర్‌ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు. ఆయనతో పాటు మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదొద్దీన్, టీఆర్ఎస్‌ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు ముత్యంరెడ్డికి అంజలి ఘటించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ముత్యం రెడ్డి ప్రజలకు ఎన్నో సేవలందించారన్నారు హరీశ్‌ రావు. ముత్యం రెడ్డి మృతి చాలా బాధ కలిగించిందని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story