నియోజకవర్గంలోని బూత్ కి ఒక్కో సోషల్ మీడియా కోఆర్డినేటర్‌ని నియమిస్తాం

నియోజకవర్గంలోని బూత్ కి  ఒక్కో సోషల్ మీడియా కోఆర్డినేటర్‌ని నియమిస్తాం

పురపాలక సంఘాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధించి తీరుతుందని... పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా నాయకులతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాల్లోని పలు పురపాలక సంఘాల ఎన్నికల సమన్వయం కోసం పార్టీ ఇన్చార్జి లను ఒకటి రెండు రోజుల్లో కెసిఆర్ ప్రకటిస్తారని వెల్లడించారు. స్థానికంగా పురపాలక ఎన్నికలు లేని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్ లు ఇతర పురపాలక సంఘాల బాధ్యతలను స్వీకరిస్తారని తెలిపారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పార్టీ సభ్యత్వ నమోదు విజయవంతమైందని.. బస్తీ, డివిజన్ కమిటీల ఏర్పాటును ఈ నెల 6వ తేదీ నాటికి పూర్తి చేయాలని కేటీఆర్‌ సూచించారు. ప్రతి నియోజకవర్గంలోని బూత్ కి ఒక సోషల్ మీడియా కోఆర్డినేటర్ నియమించి.. వారందరికీ పార్టీ తరఫున శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని... కేటీఆర్‌ తెలిపారు.

Read MoreRead Less
Next Story