ఆమెని ఫ్రెండ్ ప్రేమిస్తే నేను పెళ్లి చేసుకున్నా: యాంకర్ రవి

ఆమెని ఫ్రెండ్ ప్రేమిస్తే నేను పెళ్లి చేసుకున్నా: యాంకర్ రవి

ఏవిటో విధి విచిత్రం.. ఒకరిని లవ్ చేస్తే మరొకరిని పెళ్లాడడం.. మరొకరి లవర్‌ని తాను పెళ్లాడడం.. ఇలాంటివి సినిమాల్లోనే సాధ్యమవుతాయనుకుంటే పొరపాటే. నిజ జీవితంలో అక్కడక్కడా ఇలాంటి సంఘటనలు తారసపడుతుంటాయి. బుల్లి తెర మేల్ యాంకర్లలో ప్రదీప్ తరువాతి స్థానాన్ని ఆక్రమించిన రవి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. పటాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. యూత్‌ని ఆకర్షించే ప్రోగ్రాం కావడంతో రవి మరింత ఫేమస్ అయ్యాడు. ఈ షో ద్వారా ఇండస్ట్రీకి మరికొంత మంది కమెడియన్లు పరిచయం అయ్యారు. రవి మాటజారి కొన్ని వివాదాల్లో చిక్కుకున్నా అవి తన ఇమేజ్‌కి డ్యామేజ్ తెచ్చేవి కాకపోవడం విశేషం.

బుల్లి తెరపై వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన షోలో రవి తన లవ్ స్టోరీ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారు అనే ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు రవి, ప్రదీప్‌లు. రవి తన ఫ్యామిలీతో సహా వచ్చాడు. ఈ సందర్భంగా తన ప్రేమ, పెళ్లి విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. 'చదువుకునే రోజుల్లో నిత్య (భార్య)ను నా స్నేహితుడు లవ్ చేసేవాడు. వాళ్లిద్దరి మధ్యలో నేను మీడియేటర్‌గా వ్యవహరించే వాడిని. ఈ క్రమంలో ఆమెతో నేను లవ్‌లో పడిపోయా.. ఆమె కూడా వాడ్ని వదిలేసి నన్ను లవ్ చేయడం మొదలెట్టింది.

అప్పుడు మొదలైన ప్రేమ ఎనిమిదేళ్లు కొనసాగింది. పెళ్లితో ఇద్దరం ఒక్కటయ్యాం. మా పెళ్లయి ఏడేళ్లు అవుతుంది. మాకు ఓ పాప' అని చెప్పుకొచ్చాడు రవి తన లవ్ స్టోరీని. అలాగే మొదట అమ్మాయే పుట్టాలని ఎంతో కోరుకున్నాను. కొడుకు పుడితే నిత్యను వదిలేస్తానేమోనని మా వాళ్లంతా అమ్మాయే పుట్టాలని నాతో పాటు వాళ్లూ కోరుకున్నారు అని పాప పట్ల తన ప్రేమను వ్యక్తం చేసాడు. మొత్తానికి ఆమాట ద్వారా బుల్లితెర ప్రేక్షకుల హృదయాల్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story