ఆంధ్రప్రదేశ్

రాళ్లు, కట్టెలతో టీడీపీ నేతపై దాడి.. ఆసుపత్రికి తరలింపు..

రాళ్లు, కట్టెలతో టీడీపీ నేతపై దాడి.. ఆసుపత్రికి తరలింపు..
X

అనంతపురం జిల్లా పుట్లూరు మండలం A.కొండాపురంలో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. వినాయక చవితి చందాల విషయంలో రెండు పార్టీల నేతల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో టీడీపీకి చెందిన రాజేష్‌ చౌదరికి తీవ్రగాయాలయ్యాయి. రాజేష్‌ను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైసీపీకి చెందిన మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి.

చందా వసూలు విషయంలో రాజేష్‌ అడ్డుపడుతున్నాడని వైసీపీకి చెందిన కొందరు యువకులు రాళ్లు, కట్టెలతో దాడి చేశారు. చిన్న గొడవ కాస్తా పెద్దదిగా మారింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Next Story

RELATED STORIES