ఆ విమర్శ చాలా బాధించింది

ఆ విమర్శ  చాలా బాధించింది

ఏపీ గవర్నర్‌గా తాను బాధ్యతలు తీసుకునే సమయానికి రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు గవర్నర్ నరసింహన్. రాష్ట్ర విభజన, ఎమ్మెల్యేల రాజీనామాలు, శాంతి భద్రతల సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొన్నామన్నారు . తాను ఏ ఒక్క పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయలేదన్నారు నరసింహన్. తెలంగాణకు కొత్త గవర్నర్ వస్తుండటంతో రాష్ట్రం వీడాల్సిన సమయం వచ్చిందన్న నరసింహన్..గవర్నర్ గా తొమ్మిదేళ్ల తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.

గవర్నర్ గా తాను గుళ్లకు వెళ్లటంపై వచ్చిన విమర్శలపైనా గవర్నర్ నరసింహన్ క్లారిటీ ఇచ్చారు. తన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయటం కొంత బాధించిందని అన్నారు. ప్రతి మనిషికి వ్యక్తిగత జీవితం ఉన్నట్లే తనకు ఉంటుందని గుర్తుచేశారు.

Tags

Read MoreRead Less
Next Story