టీమిండియా భారీ విజయం.. పాయింట్ల పట్టికలో..

టీమిండియా భారీ విజయం.. పాయింట్ల పట్టికలో..

వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. రెండో టెస్టులో విండీస్‌ను 257 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. టీమిండియా విధించిన 468 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో 59.5 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది విండీస్. బ్రూక్స్‌(50) బ్లాక్‌వుడ్‌(38), హోల్డర్‌(39), బ్రేవో(23) మినహా ఎవరు చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. టీమిండియా బౌలర్లలో మహ్మద్‌ షమి, జడేజా మూడేసి వికెట్లు పడగొట్టారు. ఇషాంత్‌ శర్మ రెండు వికెట్లు తీయగా, బుమ్రాకు ఒక వికెట్‌ దక్కింది. సెంచరీ, అర్ధసెంచరీతో సత్తా చాటిన తెలుగు తేజం గాదె హనుమ విహారి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డును దక్కించుకున్నాడు. ఇదిలావుంటే మొదటి టెస్ట్‌లో కూడా భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌ విజయంతో ఐసీసీ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో 120 పాయింట్లతో టీమిండియా మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో న్యూజిలాండ్ ఉండగా.. శ్రీలంక, ఆస్ట్రేలియా.. మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్‌ ఐదో స్థానంలో ఉంది.

Tags

Read MoreRead Less
Next Story