'సాహో' ఇవేం కలెక్షన్లు బాబోయ్..

సాహో ఇవేం కలెక్షన్లు బాబోయ్..

స్టార్ డమ్ అంటే ఏంటో మరోసారి చూపించాడు ప్రభాస్. మిక్సిడ్ టాక్ వినిపిస్తున్నా సాహో కలెక్షన్లు, ప్రభాస్ స్టార్ డమ్ ని డబుల్ చేస్తున్నాయి. మొదటి నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాహోకి అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయి. టాలీవుడ్లో రికార్డులు బద్దలవుతున్నాయి. అటు బాలీవుడ్ తో పాటు సౌత్ లోనూ మంచి కలెక్షనన్లు వస్తున్నాయి. ఇప్పటికే సాహోతో ప్రభాస్ కొన్ని రికార్డ్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. సాహో కలెక్షన్లు సౌత్ లో చూస్తే... రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి నాలుగు రోజుల్లోనే దాదాపు 70 కోట్ల షేర్ కి దగ్గరయ్యింది. ఓవరాల్ గా ఇక్కడ 100 కోట్ల షేర్ మార్క్ దాటడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక కర్నాటకలో 30 కోట్ల షేర్ వస్తుందనే అంచనా ఉంది. అలాగే తమిళనాడు , కేరళలో కూడా పదికొట్ల షేర్ ని సాధించవచ్చనే అంచనాలు ఉన్నాయి..

ఇక హిందీ వెర్షన్ చూస్తే...ఈ యేడాది హిందీ బాక్సాఫీస్ రిలీజ్ డే కలెక్షన్స్ లో సాహో మూడోస్థానం దక్కించుకుంది. భారత్, మిషన్ మంగళయాన్ తర్వాత ఇరవై నాలుగు కోట్ల నలభై లక్షల ఓపెనింగ్ డే షేర్ ని సొంతం చేసుకొని ప్రభాస్ తన ప్యాన్ ఇండియా పాపులారిటీని రుచి చూపించాడు. హిందీ మార్కెట్ లో సాహో మొదటి నాలుగు రోజుల్లోనే 90 కోట్లకు పైగా షేర్ సాధించిందంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అంటే అక్కడ వంద కోట్ల క్లబ్ లో చేరుతుంది సాహో. ఓవర్సీస్ మార్కెట్లోనూ సాహో సత్తా చాటుతోంది. ఓవరాల్ గా సాహో మొదటి నాలుగు రోజుల్లో 350 కోట్ల గ్రాస్ వసూళ్ళు దాటిందని చెప్పాలి. ఈ లెక్కన తెలుగులో బాహుబలి సిరీస్ తర్వాత సాహోదే రికార్డ్. అలాగే 300ల కోట్లు సాధించిన సౌత్ హీరోల్లో రజనీకాంత్ తర్వాత ప్రభాస్ ఆ ఫీట్ సాధించిన హీరోగా నిలిచాడు. సినిమా కంటెంట్ కంటే హీరో ఇమేజ్ ఒక్కోసారి బాక్సాఫీస్ బరిలో నిలబెడుతుందని మరోసారి నిరూపించాడు ప్రభాస్.

Tags

Read MoreRead Less
Next Story