'సైరా'కు మిక్స్‌డ్ టాక్ వస్తే కలెక్షన్ల రేంజ్..

సైరాకు మిక్స్‌డ్ టాక్ వస్తే కలెక్షన్ల రేంజ్..

సాహో విడుదలైంది. టాక్ తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు సాధిస్తోంది. ఇక ఈ ఏడాది రిలీజ్ అయ్యే పెద్ద సినిమా సైరా నరసింహారెడ్డి మాత్రమే. అందుకే అందరి చూపు ఇప్పుడు సైరా మీద పడింది. ఈ సినిమా డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఎలా తీశాడో, బడ్జెట్ కి తగ్గట్టుగా సినిమా గ్రాండ్ గా ఉంటుందో లేదో, చిరంజీవితో పాటు మిగతా స్టార్స్ ఎలా చేశారో అనే పాయింట్స్ మీదే ఎక్కువ డిస్కషన్స్ జరుగుతున్నాయి.

ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సినిమా చేస్తున్నాడు. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఇక ఆ మధ్య రిలీజైన ఫస్ట్ లుక్ టీజర్ ఆడియన్స్ ని బాగానే ఇంప్రెస్ చేసింది. అయితే మెగా ఫ్యాన్స్ కి ఊపు తెప్పించింది మాత్రం ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజైన మేకింగ్ వీడియోనే.

సైరాలో చిరంజీవితో పాటు చాలా మంది స్టార్స్ ఉన్నారు. బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, కన్నడ నుంచి సుదీప్, కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతి నటించగా, నయనతార హీరోయిన్ గా చేస్తోంది. జగపతి బాబు, రవికిషన్, తమన్నా, కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క ఝాన్సీలక్ష్మీబాయి పాత్రలో కనిపిస్తుందనే వార్త హల్ చల్ చేస్తోంది. ఇంత మంది స్టార్ కాస్టింగ్ ఉండటం వల్ల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. వీరి ఇమేజ్ వల్ల ఆయా బాషల్లో సైరాకి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

సైరా నరసింహారెడ్డి మొత్తం ఐదు బాషల్లో అక్టోబర్ 2న విడుదల కాబోతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ బాషల్లో ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే చిరంజీవి బర్త్ డే కానుకగా మరో కొత్త టీజర్ ని రిలీజ్ చేశారు. ఆ టీజర్ వచ్చాక అంచనాలు పెరిగాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజిలో జరుగుతోంది. ఒక వేళ మిక్స్‌డ్ టాక్ వస్తే కలెక్షన్ల రేంజ్ ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు మూవీ లవర్స్ లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. మరి సైరా బాక్సాఫీస్ వద్ద ఎలా దూసుకుపోతాడో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story