వామ్మో.. వేలెంత బారో.. వీడియో వైరల్

సమ్‌థింగ్ ఈజ్ డిఫరెంట్.. వేలు ఎంత వెరైటీగా ఉంటే అంత సెలబ్రెటీ అయిపోవచ్చు.. అవును మరి.. అరచేతిలోని అన్ని వేళ్లకంటే చిన్నగా ఉండేది బొటన వేలు. మిగతా నాలుగు వేళ్లకు సపోర్టుగా ఉండే ఆ వేలు ఆయనకు మాత్రం పొడవుగా ఉండి అందర్నీ ఆకర్షిస్తోంది. మామూలుగా అందరికీ 2.5 అంగుళాలు మాత్రమే పెరిగే బొటనవేలు మసాచుసెట్స్‌కు చెందిన జాకబ్ పిన్‌కు ఐదు అంగుళాల పొడవు పెరిగింది. అదే అతడి ప్లస్ పాయింట్ అయింది. అందరిలోకి స్పెషల్‌గా నిలబెట్టింది. తన బొటనవేలి ప్రత్యేకతను చాటుతూ టిక్‌టాక్ వీడియోలు చేస్తూ టాక్ ఆఫ్ ది టిక్ టాక్‌గా మారాడు జాకబ్. ఈ మధ్య అతడు చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానికి 2.1 మిలియన్ల లైకులు రాగా 37 వేల మంది కామెంట్లు చేశారు. 1.5 లక్షల మంది జాకబ్‌కు ఫ్యాన్స్ అయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com