ఎంజీఎం ఆస్పత్రికి ఏంటీ దుస్థితి?

ఎంజీఎం ఆస్పత్రికి ఏంటీ దుస్థితి?

నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానకు అన్న పాట అందరికీ గుర్తుండే ఉంటుంది.... వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ప్రస్తుతం రోగుల పరిస్థితి ఇదే రీతిలో ఉంది. ఏళ్ల తరబడి వైద్యులు లేరు ....సిబ్బంది లేరు ...మందులు లేవు.... పేరుకే ఇది.. పెద్దాసుపత్రి. నిత్యం వేలాది మంది ఔట్ పేషంట్ రోగులు.. వెయ్యి మందికి పైగా ఇన్ పేషెంట్ రోగులు వైద్యం కోసం ఈ ఆసుపత్రికి వస్తూ ఉంటారు. అయితే.. వీరికి సరిపడా వైద్యులు లేరు.. పారామెడికల్ సిబ్బంది లేరు.. మందులు అందుబాటులో లేవు. పాలకులు మారుతున్నా ఎంజిఎం ఆసుపత్రి పరిస్థితి మాత్రం మారడం లేదు. ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఎంజీఎం నేడు.. అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.

ఇటీవల.. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌తో పాటు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాక్‌రావు ఎంజీఎంను సందర్శించి దీని రూపురేఖలు మారుస్తామని హామీల వర్షం కురిపించారు. 10కోట్లతో ఎంజిఎంను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఆస్పత్రిలో మూతపడ్డ ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్‌ను మళ్లీ తెరిపిస్తామని ప్రకటించారు. అయితే..మంత్రులు ఇచ్చిన హామీలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి. .

రోగులకు మెరుగైన వైద్యం అందాలంటే సరిపడా వైద్యులు ఉండాలి. ఆస్పత్రిలోని గోడలకు రంగులేస్తేనో.. అందమైన బొమ్మలు చిత్రీకరిస్తేనో మంచి వైద్యం అందుతుందా అని రోగులు ప్రశ్నిస్తున్నారు. స్టాఫ్‌ను భర్తీ చేయకుండా రోగులకు వైద్యం అందించడం ఎలా సాధ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాల్సి ఉంది. ఇక.. ఆసుపత్రి వసతుల గురించి తెలుసుకునేందుకు వచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.. ఎంజీఎం ఆస్పత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేసి.. ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులు భర్తీ చేస్తామని.. అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఇచ్చిన వాగ్దానాలనే మళ్లీ రిపీట్‌ చేశారు. ఈనేపథ్యంలో..ఎం జిఎం ఆసుపత్రిని ఏ మేరకు అభివృద్ధి చేసి.. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తారో వేచి చూడాలి .

Tags

Read MoreRead Less
Next Story