అక్టోబర్‌లో నిశ్చితార్థం.. వచ్చే ఏడాది పెళ్లి

అక్టోబర్‌లో నిశ్చితార్థం.. వచ్చే ఏడాది పెళ్లి

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్‌లు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటే ఇండస్ట్రీ అంతా చెవులు కొరుక్కుంది. వీటన్నింటికీ చెక్ పెడుతూ వచ్చే నెలలో నిశ్చితార్థం చేసుకుంటున్నట్లు ప్రకటించింది ఈ జంట. ఆపై 2020లో వివాహం చేసుకుంటామని తమపై వస్తున్న వార్తలకు తెరదించింది. ఏడాది కాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ ఇద్దరూ.. ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ రణ్‌బీర్ తండ్రి అనారోగ్యం కారణం ఒకటైతే, అలియా భట్ హెల్త్ కూడా బాలేదని పెళ్లిని వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు సమాచారం.

ఆ మధ్య జరిగిన ఫిలిం ఫేర్ అవార్డు వేడుకలలో రణ్‌భీర్ 'సంజూ' చిత్రానికి ఉత్తమ నటుడు అవార్డు అందుకోగా, అలియా 'రాజీ' చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డుని ఒకే వేదికపై అందుకున్నారు. ఈ సందర్భంగా అలియా మాట్లాడుతూ.. నాకు ఇష్టమైన, నాకు సంబంధించిన ప్రత్యేకమైన వ్యక్తి ఇక్కడ ఉన్నారు. ఐ లవ్యూ రణ్‌బీర్ అంటూ మనసులోని మాట చెప్పేసరికి వీరిమధ్య కొనసాగుతున్న ప్రేమాయణం అందరికీ తెలిసింది.

Tags

Read MoreRead Less
Next Story