ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోందంటూ చంద్రబాబు ఫైర్

టీడీపీ కార్యకర్తలను రక్షించుకునేందుకు ఎంతవరకైనా పోరాడతానన్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు. అధికారం ఉంది కదా అని బరితెగించిపోతే.. భవిష్యత్తులో కాలగర్భంలో కలిసిపోక తప్పదని హెచ్చరించారు. అరు నెలల్లో మంచి పేరు తెచ్చుకుంటానన్న జగన్.. చరిత్ర మరిచిపోయినట్టున్నారని అన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన వైసీపీ బాధితుల పునరావాస కేంద్రానికి వెళ్లిన చంద్రబాబు.. వైసీపీ దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాడులు, అక్రమ కేసులు, అమ్మాయిలపై అఘాయిత్యాలతో అరాచకాలకు పరాకాష్టగా జగన్ పాలన కొనసాగుతోందని అన్నారు చంద్రబాబు. ఇది రాక్షస పాలన కాకపోతే మరెంటని ప్రశ్నించారు. చినగంజాంలో మత్స్యకార కుటుంబానికి చెందిన ఆడబిడ్డను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అఘాయిత్యాలపై ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించిన చంద్రబాబు.. పోలీసులు మొద్దునిద్ర వీడి ప్రజలకు భద్రత కల్పించాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com