అవకాశాల కోసం ఇలియానా..

ఇల్లీ భామను తెలుగు ప్రేక్షకులు మర్చిపోకపోయినా.. బాలీవుడ్ పొమ్మనేసరికి మళ్లీ టాలీవుడ్‌కి రాక తప్పట్లేదు. తెలుగులో తాను నటించింది తక్కువ సినిమాలే అయినా సూపర్ డూపర్ హిట్టై మంచి పేరే తెచ్చిపెట్టాయి.. రామ్‌తో నటించిన దేవదాసు, మహేష్ బాబుతో నటించిన పోకిరి. ఇలా తెలుగులో మంచి అవకాశాలే వస్తున్నా.. హిందీ ఇండస్ట్రీని కూడా రుచిచూద్దామనుకుంది. అక్కడ కూడా మొదట్లో మంచి అవకాశాలే దక్కించుకుంది. ఈ క్రమంలో తెలుగులో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో రవితేజతో ఆడిపాడింది. సన్నజాజి తీగలా నాజూగ్గా వుండే ఇలియానా బొద్దుగా కనిపించే సరికి ఈ చిత్రంలో ఆమెని చూసిన తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు . ఓ పక్క బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్, మరో పక్క తగ్గిన సినిమా అవకాశాలు.. వెరసి వర్కవుట్లు చేస్తూ స్లిమ్ అయ్యేందుకు తీవ్రంగా కసరత్తులు చేస్తోందట. మరి ఇది కూడా వర్కవుట్ అవుతుందో లేదో.. అవకాశాలు వస్తాయో లేదో చూడాలి. రోజుకో తార తెరంగేట్రం చేస్తున్న ఈ రోజుల్లో ఇలియానాను ఆదరించే తెలుగు ప్రేక్షకులు వుంటే ఇల్లీ లక్కు మారినట్లే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

