ఏపీ ప్రభుత్వంపై లోకేష్ ఫైర్

వైసీపీ ప్రభుత్వంలో అమరావతి ఎడారిగా కనిపిస్తోందని అన్నారు లోకేష్. అభివృద్ధి పనులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే చెడ్డ పేరు తెచ్చుకున్న ప్రభుత్వంగా మిగిలిపోయిందని విమర్శించారు. పాదయాత్ర సమయంలో 900 హామీలు ఇచ్చి ఇప్పుడు నవరత్నాలను మాత్రమే హామీలుగా చెబుతోందన్నారు లోకేష్.
కొత్త ఇసుక విధానం అంటూ గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం.. కొత్తగా చేసిందేమి లేదన్నారు లోకేష్. టీడీపీ ప్రభుత్వంలో సిమెంట్ కన్న తక్కువ ధరలో ట్రాక్టర్ ఇసుక వచ్చిందని.. ఇప్పుడు ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. ఇసుక మాఫియా అని విష ప్రచారం చేసిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పటివరకు ఒక్క అవినీతిని కూడా ఎందుకు నిరూపించలేకపోయిందని ప్రశ్నించారు. అనుభవం లేని వ్యక్తి సీఎం అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తోందని అన్నారు లోకేష్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com