పానీ పూరీ తినడానికి వెళ్తున్నారా.. ఒక్క నిమిషం..

పానీ పూరీ తినడానికి వెళ్తున్నారా.. ఒక్క నిమిషం..

పానీ పూరీ.. ఆహా.. ఈ పేరు వింటుంటే.. పానీ పూరీ బండి దగ్గరకు పరిగెట్టాలనిపిస్తోంది కదూ..! అక్కడి వెళ్లి గుటుక్కున నోట్లో వేసుకోవాలని పిస్తుంది కదా..! ఇక సాయంత్రమైతే చాలు.. చాలామంది పానీపూరీ బండి ముందు క్యూ కడతారు. పడిగాపులు కాసి మరీ పానీపూరీ రుచిని ఆస్వాదిస్తారు. నీళ్లలో ముంచితీసే పూరీ కోసం ప్లేట్లు పట్టుకుని బండి చుట్టూ చేరతారు. అయితే, చాలామంది పానీపూరీ వ్యాపారులు పానీ తయారీలో నాణ్యత, పరిశుభ్రత పాటించడం లేదు. ఇప్పటికీ చేతులను పాత్రల్లో ముంచి పానీపూరీ ఇస్తున్నారు. కొంతమంది పానీ తయారు చేసేవిధానం చూస్తే.. పానీ పూరీని లొట్టలేసుకుని తినేవారు.. ఇక పానీపూరీ జోలీకే వెళ్లరు. ఓ వ్యాపారి వాటర్‌ని కలుపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే జీవితంలో పానీపూరీని ముట్టుకోరు. పానీపూరీ తినాలంటే.. ఆ వీడియోనే గుర్తుకొచ్చేలా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story