ఆ మూవీ సక్సెస్ వాళ్ళకి అంత అవసరమా..?

ఆ మూవీ సక్సెస్ వాళ్ళకి అంత అవసరమా..?

సక్సెస్ లో ఉన్న హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కాంబినేషన్లో సినిమా వస్తున్నప్పుడు ఆ టీమ్ లో ఓ జోష్ ఉంటుంది. కానీ ఫెయిల్యూర్స్ లో ఉన్న టీమ్ నుంచి వస్తున్న సినిమాకి టెన్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ టీమ్ లోనూ టెన్షన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సినిమా హీరో, విలన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్నారు. ఆ మధ్య ఫ్లాపుల్లో ఉన్న నానికి, భలే భలే మగాడివోయ్ తో సూపర్ హిట్ దక్కింది. ఆ తర్వాత ఒకటి రెండు హిట్స్ వచ్చాక, కృష్ణార్జున యుద్దం, దేవదాస్ తో మళ్ళీ ఫ్లాపుల బాట పట్టాడు. ఇక రీసెంట్ మూవీ జెర్సీకి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. కానీ పోటీ ఎక్కువగా ఉండటం వల్ల అంతగా లాభాలు రాలేదు. అందుకే ఈ గ్యాంగ్ లీడర్ పై నాని చాలా ఆశలు పెట్టుకున్నాడు.

మైత్రీ మూవీస్ కు కూడా గ్యాంగ్ లీడర్ సినిమా సక్సెస్ అవ్వడం కీలకం. రంగస్థలం తర్వాత ఈ సంస్థలో మరో సక్సెస్ రాలేదు. వరుసగా సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటోనీ, డియర్ కామ్రేడ్ సినిమాలు నష్టాలు తెచ్చిపెట్టాయి. మధ్యలో వచ్చిన చిత్ర లహరి యావరేజ్ హిట్ గా నిలిచింది. అందుకే మైత్రీ నిర్మాతలకు గ్యాంగ్ లీడర్ సక్సెస్ అవ్వడం చాలా అవసరంగా మారింది. ఇక డైరక్టర్ విక్రమ్ కే కుమార్ కు కూడా ఈ సినిమా పరీక్షే. మనం సినిమా తరువాత ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి కమర్షియల్ సక్సెస్ లేదు. వీరితో పాటు ఇందులో నెగిటివ్ రోల్ పోషిస్తున్న హీరో కార్తికేయకి ఈ సినిమా సక్సెస్ అయ్యి పేరు తీసుకురావడం అవసరం, సో.. ఇలా నాని, కార్తికేయతో పాటు దర్శకనిర్మాతలకు కూడా అంతా మంచి జరగాలంటే ఈ నెల 13న రిలీజ్ అవుతున్న గ్యాంగ్ లీడర్ హిట్ కొట్టి తీరాల్సిందే.

ఇక గ్యాంగ్ లీడర్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఐదుగురు ఆడవాళ్ళ బ్యాచ్ కి నాని గ్యాంగ్ లీడర్. కామెడీ ప్రధానంగా సాగే కథగా కనిపిస్తోంది. నానికి జోడీగా ప్రియాంక మోహన్ నటించింది. ఇప్పటి వరకు వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ పెరిగింది. ఇఫ్పటి వరకు సినిమా మీద మంచి బజ్ అయితే ఉంది. మరి సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చితే.. గ్యాంగ్ లీడర్ టీమ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కినట్లే.

More Movie News from TV5 Tollywood :

Tags

Read MoreRead Less
Next Story