వంట గ్యాస్ ధర ఇంత పెరిగిందేంటి..

X
గ్యాస్ ధరలను ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ సంస్థలు సవరిస్తుంటాయి. అందులో భాగంగానే సెప్టెంబర్ నెలలో గృహ వినియోగ వంట గ్యాస్ ధర సవరించిన రేట్ల ప్రకారం రూ.16 పెరిగింది. 14 కిలోల బరువున్న సిలిండర్ ధర గత నెలలో రూ.590.50 వుంటే.. ఇప్పుడది రూ.16లు పెరిగి రూ.606.50గా ఉంది. ఈ ధర ఆదివారం నుంచి అమలులోకి వచ్చింది. ఇదే విధంగా వాణిజ్య వినియోగానికి ఉపయోగించే 19 కిలోల బరువున్న సిలిండర్ ధర రూ. 1,123 నుంచి రూ.1,174కు పెరిగినట్లు ఆయిల్ సంస్థలు వెల్లడించాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
