ఎన్టీఆర్ కొమరం భీమ్ లుక్‌తో పాటు డైలాగ్‌ రిలీజ్ ఎప్పుడంటే..?

ఎన్టీఆర్ కొమరం భీమ్ లుక్‌తో పాటు డైలాగ్‌ రిలీజ్ ఎప్పుడంటే..?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరుపుకుంటోంది. బాహుబలి సిరీస్ తర్వాత జక్కన్న తీస్తున్న మూవీ కావడంతో ఈ ట్రిపుల్ఆర్ కోసం నిర్మాత డివివి దానయ్య దాదాపు రూ. 400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అందులో విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఎక్కువగా ఖర్చు అవుతాయంటోంది చిత్ర యూనిట్. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న మల్టిస్టారర్ కావడం టాలీవుడ్‌లో ఈ సినిమా మరింత హాట్ టాపిక్ గా మారింది.

ఆర్ఆర్ఆర్ మూవీని తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇద్దరు పోరాట యోధుల కథతో తీస్తున్నాడు రాజమౌళి. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నారు. ఇక చరణ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ నటిస్తోంది. అలాగే ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ నుంచి ఎమ్మా రాబర్ట్స్ ని తీసుకొస్తున్నారు. వీరితో పాటు బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

ఆర్.ఆర్.ఆర్ మూవీని వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేయడానికి ప్లాన్ చేశాడు రాజమౌళి. అందుకోసం పక్కా ప్లానింగ్ తో ఈ మూవీ షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఆ మధ్య హీరోలిద్దరికీ షూటింగ్‌లో గాయాలవడంతో కాస్త బ్రేక్ తీసుకున్నారని, ఈ కారణంగా లేట్ అవుతుందనే వార్తలు వచ్చినా, చిత్ర యూనిట్ మాత్రం అనుకున్న టైమ్ కి రిలీజ్ చేయడానికే ట్రై చేస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మీద బల్గేరియాలో మూడు వారాల పాటు షూటింగ్ ప్లాన్ చేశారు. అక్టోబర్ 22న కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ని డైలాగ్ తో పాటు రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది టీమ్. సినిమా విడుదలయ్యే ఐదు బాషల్లోనూ తారక్ తానే డబ్బింగ్ చెప్పబోతున్నాడట. అలాగే చరణ్ కూడా చెప్పే ఛాన్స్ ఉంది. అందుకోసం ఆయా బాషలను కూడా నేర్చుకుంటున్నారు ఆర్‌ఆర్‌ఆర్ హీరోలు.

Tags

Read MoreRead Less
Next Story