స్కిల్ ఛాలెంజ్.. మూడు నెలలు అలా చేస్తే.. - శ్రీధర్ నల్లమోతు

స్కిల్ ఛాలెంజ్.. మూడు నెలలు అలా చేస్తే.. - శ్రీధర్ నల్లమోతు

లైఫ్ డైనమిక్‌గా ఉండాలి.. లైఫ్‌లో ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. కొంతమందిలో చాలా లోపాలు ఉంటాయి. కొందరికి ఇంగ్లీష్ సరిగా రాకపోవచ్చు.. మరికొంతమందికి వారు పనిచేస్తున్న రంగంలో సబ్జెక్ట్‌కి సంబంధించిన నాలెడ్జ్.. సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవచ్చు. ఇలాంటి లోపాలు చాలమందికి ఉండే అవకాశం ఉంది. అలాగే చాలామందికి సింగింగ్, డ్యాన్స్ నేర్చుకోవాలని ఉంటుంది. ఇలాంటివి అన్నీ సహజంగా అందరికీ జనవరి 1న గుర్తొచ్చి, జనవరి 5-7 తేదీలకి మర్చిపోతారు. అలాంటి వారికోసం #OYChallenge స్ఫూర్తి తో SkillChallenge ని రూపొందించారు నల్లమోతు శ్రీధర్. సెప్టెంబర్ 5వ తేదీ నుండి మూడు నెలల పాటు స్కిల్ ఛాలెంజ్ కొనసాగుతుంది. డిసెంబర్ 4తో ముగుస్తుందన్నారు శ్రీధర్.

* ఈ మూడు నెలల కాలంలో మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారన్నదానిపై ఓ స్కిల్ ఎంపిక చేసుకోవాలి. అది మీ ఫీల్డ్‌కి సంబంధించిన సబ్జెక్ట్ నాలెడ్జ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు.

* ప్రతీరోజూ ఎట్టి పరిస్థితుల్లో ఓ గంట సమయం దానిపై వెచ్చించాలి. ఏరోజైనా గంట కుదరకపోతే కనీసం అరగంటైనా స్పెండ్ చేయాలి.

* మీ ప్రోగ్రెస్ ట్రాక్ చేసుకుంటూ ఉండాలి.

* ఒక్కరోజు కూడా బ్రేక్ ఇవ్వకూడదు

ఖచ్చితంగా మూడు నెలల తర్వాత మీపై మీకు ఎంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందో మీరే కళ్లారా చూస్తారు అంటున్నారు శ్రీధర్. Get ready for it. పాల్గొనాలనుకునే వారు sridharcera@gmail.com అనే మెయిల్ ఐడికి మీ పేరు, ఫోన్ నెంబర్, దేనిపై పట్టు సాధించాలనుకుంటున్నారో.. ఆ వివరాలు మెయిల్ చెయ్యండన్నారు శ్రీధర్.

Tags

Next Story