అతిలోక సుందరి నిజంగానే దిగివచ్చిందా..!

అతిలోక సుందరి నిజంగానే దిగివచ్చిందా..!

అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి మైనపు విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. సింగపూర్‌లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి కుమార్తెలు జాన్వీ, ఖుషీ కపూర్‌లు పాల్గొన్నారు.

అతిలోక సుందరి నిజంగానే దిగివచ్చిందా అన్నట్టు శ్రీదేవి విగ్రహాన్ని రూపొందించారు. బంగారు రంగు వస్త్రాలు ధరించి, తలపై కిరీటంతో తయారు చేసిన మైనపు బొమ్మ విశేషంగా ఆకట్టుకుంటోంది. 1987లో శ్రీదేవి నటించిన సూపర్ హిట్‌ చిత్రం మిస్టర్‌ ఇండియాలోని హవా హవాయి లుక్ ఆధారంగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు.

శ్రీదేవి గత ఏడాది ఫిబ్రవరి 24న దుబాయ్‌లో ప్రమాదవశాత్తు కన్నుమూశారు. దీంతో ఆమె మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సింగపూర్‌లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియం ప్రకటించింది. దీని ప్రకారమే శ్రీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Tags

Next Story