ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.. చంద్రబాబు
BY TV5 Telugu4 Sep 2019 1:14 AM GMT

X
TV5 Telugu4 Sep 2019 1:14 AM GMT
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి సంస్కరణలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతాయన్నారు. అయితే ఆంధ్రా బ్యాంక్ విలీనాన్ని తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని లేఖలో తెలిపారు చంద్రబాబు. ఆంధ్రాబ్యాంక్ పేరు తెలుగు ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడి ఉందన్నారు. తెలుగు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతూ.. ఆంధ్రాబ్యాంక్ విశేష సేవలందించిందన్నారు. విలీనం అనివార్యం అయితే.. ఆంధ్రా బ్యాంక్ పేరునే కొనసాగించాలని కోరుతున్నట్లు లేఖలో తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు.
Next Story