సామాన్యుడిలా చెన్నైలోనే ఉంటా : గవర్నర్ నరసింహన్

ఏపీలో అనేక సమస్యలున్న సమయంలో గవర్నర్‌గా కాలుమోపానని.. ఇప్పుడు తెలుగు ప్రజల నుంచి మంచి జ్ఞాపకాలను తీసుకెళ్తున్నానని అన్నారు గవర్నర్ నరసింహన్. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మీడియాతో గవర్నర్ తన అభిప్రాయాలు పంచుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో తాను తెలంగాణకు వ్యతిరేకమని ప్రచారం చేశారని.. ఒక్క బుల్లెట్ కూడా ఉపయోగించొద్దని ఉద్యమ సమయంలో చెప్పినట్లు గుర్తు చేశారు. రాష్ట్ర విభజన, ఎమ్మెల్యేల రాజీనామాలు, శాంతి భద్రతల సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కున్నామన్నారు. తాను ఏ ఒక్క పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయలేదని అన్నారు నరసింహన్.
ఎప్పుడూ దేవాలయాలను దర్శించడానికి వెళ్తారంటూ తనపై చేసిన ఆరోపణలు బాధించాయన్నారు నరసింహన్. తిరుపతి, యాదగిరిగుట్ట, భద్రాచలం ఆలయాలకే ఎక్కువ వెళ్లానని.. ప్రతిరోజూ హైదరాబాద్‌లోని ఆలయానికి వెళ్తానని చెప్పారు. ప్రతీ మనిషికి వ్యక్తిగత జీవితం ఉన్నట్లే తనకు ఉంటుందని గుర్తుచేశారు. ఇకపై సామాన్యుడిలా జీవితం గడుపుతానన్నారు గవర్నర్ నరసింహన్. చెన్నైలోనే స్థిరపడతానని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com