మార్కెట్లో కొత్త ఫోన్.. 5 నిమిషాలు ఛార్జింగ్ పెడితే చాలు.. 3 గంటలు మీ ఇష్టం..

మార్కెట్లో కొత్త ఫోన్.. 5 నిమిషాలు ఛార్జింగ్ పెడితే చాలు.. 3 గంటలు మీ ఇష్టం..

ఛార్జింగ్ పెట్టిన కొద్ది సేపటికే అయిపోతే ఎలా.. అన్ని పనులు ఫోన్‌తోనే. ఫోన్ లేకపోతే ఎంత కష్టం. ఛార్జింగ్ లేక స్విచ్ఛాఫ్ అయిపోతే.. మాటలు మధ్యలో కట్ అయిపోతాయి. ఈ క్రమంలో చాలా మంది పవర్ బ్యాంకులను వెంట పెట్టుకుంటున్నారు. వాటికి కూడా ఛార్జింగ్ పెట్టాల్సిందే. ఓ గంట ఛార్జింగ్ పెడితే కానీ ఆరోజు నడవదు. అదీ చూసుకుని మాట్లాడాల్సి వస్తుంది. మరి 5 నిమిషాల్లో ఛార్జింగ్ అయ్యే ఫోన్ వస్తే.. ఆనందంతో ఎగిరి గంతేయరూ. అందుకే మీ కోసం మార్కెట్లోకి వివో ఫోన్ వచ్చేసింది. 5నిమిషాలు ఛార్జింగ్‌తో 3 గంటలు మాట్లాడేయొచ్చు. వివో ఈ నెలలో లాంచ్ చేసే జడ్ 1 ఎక్స్‌ ఫోన్‌లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయంటోంది కంపెనీ. ముఖ్యంగా దీంట్లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ నెల 6వ తేదీన వివో జడ్ 1 ఎక్స్ మార్కెట్లోకి రానుంది. ఇక ఫోన్ ధర విషయానికి వస్తే దాదాపు రూ.16 వేల వరకు ఉండొచ్చని అంచనా.

ఈ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్లు చూస్తే.. 6.38 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ, 256 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 నిమిషాల చార్జ్, 3 గంటల టాక్‌‌టైం, 22.5 వాట్ వివో ప్లాష్ చార్జ్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ఫ్రింట్, 48 ఎంపీ + 8 ఎంపీ + 2 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story