ఆ ప్రాజెక్టులో కోమటిరెడ్డి కమిషన్‌ తీసుకున్నారు: గుత్తా

ఆ ప్రాజెక్టులో కోమటిరెడ్డి కమిషన్‌ తీసుకున్నారు: గుత్తా

బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు TRS ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి. రాష్ట్రానికి రావాల్సిన యూరియా తెప్పించాలన్న కనీస సోయి బీజేపీ నేతలకు లేదన్నారు. నల్గొండలో పార్టీ నేతలతో సమావేశమైన గుత్తా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కూర్చొని రాజకీయలు చేస్తూ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని బీజేపీపై ఫైర్‌ అయ్యారు గుత్తా. కేంద్ర ప్రభుత్వమే.. రాష్ట్రంలో యూరియా కొరతకు కారణమన్నారు. కోమటిరెడ్డికి మర్యాద, హుందాతనం తెలియవన్నారు. బ్రాహ్మణ వెళ్లెంల ప్రాజెక్టులో కోమటిరెడ్డి కమిషన్‌లు తీసుకున్నారని గుత్తా ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story