కె.జి.ఎఫ్-2 హైదరాబాద్ కి ఎందుకు షిఫ్ట్ అయ్యింది..?
కె.జి.ఎఫ్.. గతేడాది నేషనల్ వైడ్ టాప్ హిట్స్ లో ఇదొకటి. కన్నడ సినీ పరిశ్రమకైతే హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా. ఈ మధ్య కాలంలో కె.జి.ఎఫ్ లాంటి మాస్ సినిమా రాలేదు. మంచి కథ, కథనానికి టేకింగ్, బ్యాగ్రౌండ్ స్కోర్ తో టాప్ రేంజ్ కి తీసుకెళ్ళింది టీమ్. ఈ సినిమా కర్ణాటకలోనే కాదు హిందీ, తెలుగు, తమిళ, మలయాళ బాషల్లో సూపర్ సక్సెస్ అయ్యింది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో, యష్ నటించిన కె.జి.ఎఫ్ కి సీక్వెల్ గా చాప్టర్ 2 వస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రేంజ్ ని మరింత పెంచడానికి కొంత మంది టాప్ స్టార్స్ ని తీసుకుంది టీమ్. అందులో అధీరా పాత్ర కోసం బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ ని తీసుకున్నారు. దీని వల్ల హిందీలో కె.జి.ఎఫ్ చాప్టర్ 2కి మరింత క్రేజ్ పెరుగుతుంది.
కె.జి.ఎఫ్ 2 షూటింగ్ కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ పరిసరాల్లో ప్లాన్ చేశారు. కానీ దీనివల్ల అక్కడ పర్యావరణం దెబ్బతింటుందని ఓ వ్యక్తి కేసు పెట్టడంతో, కోర్టు అక్కడ షూటింగ్ చేయొద్దని తీర్పునిచ్చింది. దీంతో ఇప్పుడు చిత్ర యూనిట్ హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఎక్కువ భాగం షూట్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాని వచ్చే సమ్మర్లో ఏప్రిల్ 29న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com